Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మావోయిస్టులు మృతి
- ఒక జవాన్, గ్రామ వాసికి తీవ్ర గాయాలు
- బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని గల్గాం దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపిన సమాచారం మేరకు ఘటన వివరాలిలా ఇలా ఉన్నాయి. ఉసూర్-గల్గాం గ్రామం మధ్యనున్న దండకారణ్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్లో 196 బెటాలియన్‌కు చెందిన అఖిలేష్ అనే జవాన్‌కు మావోయిస్టులు కాల్చిన బుల్లెట్ నడుములో దూసుకుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. నాడ్పల్లి గ్రామానికి చెందిన గ్రామీణ వాసి కొట్టం సోముకు బుల్లెట్ తగిలింది. మొదట ఊసూరు ప్రాథమిక వైద్యశాలకు తరలించి, అక్కడ ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స తర్వాత బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్పీ ధృవీకరించారు.