Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త మంత్రులకు చోటు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో వివిధ క్యాబినెట్ కమిటీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పునర్వ్యవస్థీక రించారు. కొత్త, పాత మంత్రులతో మార్పులు, చేర్పులు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వం వహిస్తున్న అత్యంత ప్రాధాన్యం ఉండే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ ఉప సంఘంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మతి ఇరానీ, కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, షిప్పింగ్ మంత్రి శర్వానంద సోనోవాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు చోటు దక్కింది. అయితే క్యాబినెట్ కమిటి ఆన్ పొలిటికల్ అఫెర్స్ (సీసీపీఏ)లో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం, కార్పొరేషన్ మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరి, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం ఉన్నారు. రాజకీయ వ్యవహారలపై నిర్ణయాలు తీసుకునే కీలక కమిటీల్లో సీసీపీఏ ఒకటి.మునుపటి ఆర్థిక వ్యవహా రాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ)లో శిరోమణి అకాలీదళ్ హర్ సిమ్రత్ కౌర్‌తో సహా 11 మంది సభ్యులు ఉండగా, కొత్త ప్యానెల్లో ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాజనాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, ఎస్. జైశంకర్, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ కమిటీలో ఉన్నారు.కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల ఉప సంఘంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సమా చార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌లకు తొలిసారి చోటు దక్కింది. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా కూడా ఈ కమిటీలో ఉన్నారు. మంత్రి వర్గంలో చోటు కోల్పోయిన రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ స్థానంలో అనురాగ్ సింగ్ ఠాకూర్, కిరణ్ రిజిజులకు బాధ్యతలకు అప్పగించారు. తావర్ చంద్ గెహ్లాట్ స్థానంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌కు చోటు దక్కింది. ఈ కమిటీలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి. మురళీధరన్‌లు ప్రత్యేక ఆహ్వాని తులుగా ఉన్నా రు.ఉపాధి, నైపుణ్యాభివద్ధి, ఉపాధి కమిటీలోకి రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్, పెట్రోలి యం శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరీ, కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌లకు చోటు దక్కింది. ప్రధాని మోడీ నేతత్వం వహించే ఈ కమిటీలోకి జి. కిషన్ రెడ్డి, ఆర్సీపి సింగ్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ప్రధాని మోడీ నేతత్వం వహించే పెట్టుబడులు, వద్ధి కేబినెట్ కమిటీలో నారా యణ రణే, జ్వోతి రాధిత్య సింథియా, అశ్వనీ వైష్టవ్ లకు చోటు దక్కింది. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా నేతత్వం వహించే వసతి కేబినెట్ కమిటీలోకి హర్దీప్ సింగ్ పూరీని తీసుకున్నారు.ఇక దేశ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ-భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కమిటీలో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హౌం మత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జై శంకర్ సుబ్రహ్మణియన్ కొనసాగు తున్నారు. అలాగే మోడీ, షాలతో కూడిన నియ మకాల కమిటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు.