Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల దావాలపై కేంద్రం అలసత్వం
- రాష్ట్రాలను సమన్వయం చేయడంలో మోడీ సర్కార్ విఫలం
- లక్షలాది మంది ఆదివాసీలపై ప్రభావం
న్యూఢిల్లీ : అటవీ భూములపై వాదనల పరిష్కారాలను సమీక్షించడంలో సమన్వయ పాత్ర పోషించే బాధ్యతను మోడీ ప్రభుత్వం విస్మరించింది. రాష్ట్రాలను సమన్వయపరిచే విషయంలో దూరాన్ని పాటిస్తున్నది. దీంతో అటవీ భూములకు సంబంధించి వాదనలు పెద్ద ఎత్తున తిరస్కరణకు గురవువుతున్నాయి. ఇలాంటివి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 50 శాతానికి పైగా నివేదించబడుతున్నాయి. అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం.. అటవీ భూములపై తిరస్కరిం చబడిన వాదనలను సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించి రెండేండ్లకు పైగా గడుస్తున్నది. అయితే, ఈ విషయంలో మాత్రం కలుగజేసుకోవడానికి కేంద్రం అంతగా దృష్టిసారిం చలేదు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికీ ఎలాంటి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించకపోవడం గమనార్హం.కేంద్ర పర్యవేక్షణ విధానం, నిర్దిష్ట మార్గదర్శకాలు లేనప్పుడు తిరస్కరిం చబడిన దావాల సమీక్షలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వర్తించే పద్దతుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఫలితంగా, చట్టబద్ధమైన హక్కుదారులు తమ సొంత భూమిపై ఆక్రమణదారులుగా ప్రకటించబడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని సామాజిక కార్యకర్తలు, పర్యావర ణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం లక్షలాది మంది ప్రజలు ముఖ్యంగా గిరిజనులపై పడే ప్రమాదం ఉంటుందని తెలిపారు.కేంద్ర గిరిజన వ్యవహారాల సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. అటవీ భూములపై దాఖలైన మొత్తం 20,01,919 దావాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తిరస్కరణకు గురయ్యాయి. మరో 4.61 లక్షల దావాలు తిరస్కరణకు దగ్గరలో ఉన్నాయి. మధ్యప్ర దేశ్‌లో 5.85 లక్షలకు పైగా క్లెయిమ్‌ల నుంచి వ్యక్తిగత అటవీ హక్కులపై 2.30 లక్షల దావాలు మాత్రమే అంగీకరించినట్టు అధికారిక సమాచారం చూపిస్తున్నది. ఒడిషా, ఛత్తీస్‌గఢ్, కర్నాటక వంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి.50 శాతం వాదనలను తిరస్కరించిన ఒడిషా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో దాదాపు 2వేల మంది ఆదివాసీ ప్రజలు గతేడాది జనవరిలో నిరసన ప్రదర్శనలకు దిగారు. అనేక ఆదివాసీ సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి.అలాగే, అసోంలో 80 శాతానికి పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటికైనా కేంద్రం కలుగజేసుకొని గిరిజనుల హక్కులను కాపా డాలని ఆదివాసీ సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లక్షలాది మంది గిరిజనులు తమ హక్కులను కోల్పో యే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.