Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరితెగించిన హర్యానా బీజేపీ ప్రభుత్వం
- ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వారిపై కేసులా? : ఎస్కేఎం
న్యూఢిల్లీ : నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించా లని కోరుతూ శాంతియు తంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానాలో బీజేపీి ప్రభు త్వం దేశద్రోహం, హత్యాయత్నం కేసులు బనాయిం చింది. ఈనెల 11న సిర్సాలోని హర్యానా డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వాను రైతులు అడ్డుకు న్నారు. బీజేపీ నాయకుల సామాజిక బహిష్కరణలో భాగంగానే వారు ఈచర్య తీసుకున్నారు. దీనిపై సిర్సా పోలీసులు సెక్షన్ 124 ఎ
(రాజద్రోహం)తో పాటు 307 (హత్యాయత్నం), 186 (ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వర్తించడంలో ప్రభుత్వోద్యోగు లను అడ్డుకోవడం) వంటి క్రూరమైన సెక్షన్ల కింద కేసులు బనాయించారు. రైతు నేతలు హరిచరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్‌తో పాటు వంద మందికి పైగా అన్నదాతలపై కేసులు పెట్టారు.. సిర్సా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అర్పిత్ జైన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు, ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. ఈ నెల 11న డిప్యూటీ స్పీకర్ అధికా రిక కారును సిర్సాలో రైతుల బృందం నినాదాలు చేస్తూ, నల్ల జెండాలు ఊపుతూ అడ్డుకుంది. ఈ ప్రదర్శన సందర్భంగా రైతులు రాళ్లతో వాహనాల విండ్ స్క్రీన్‌ను పగులగొట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేవు.
రైతులను రెచ్చగొట్టడానికే : దర్శన్పాల్
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సీనియర్ నాయ కుడు దర్శన్ పాల్ మాట్లాడుతూ ఇలాంటి చర్యలు తీసుకొని రైతులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ''రాజద్రోహ కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం రైతులను రెచ్చగొడుతోంది. వాహనం విండ్‌స్క్రీన్ పగిలితే రాజద్రోహం, హత్య కేసులు ఎలా పెడతారు?'' అని ప్రశ్నించారు. రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేయడం రాజద్రోహ నేరమా?, వారిపై కేసులు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''బీజేపీ, జేజేపీ చట్టాలకు మద్దతు ఇచ్చే స్వతంత్రులతో సహా అందరు శాసన సభ్యులను శాంతియుతంగా బహిష్కరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని మేము ఇప్పటికే ప్రకటించాం'' అని దర్శన్ పాల్ అన్నారు.
ఎంపీలకు ఎస్కేఎం పీపుల్స్ విప్
దేశంలోని రైతులందరి తరఫున లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పీపుల్స్ విప్‌ను జారీచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడు నల్ల చట్టాల రద్దుకు, ఎంఎస్పీ హామీ చట్టాన్ని ఆమోదించడం కోసం అన్ని పార్టీల ఎంపీలు కృషి చేయాలని కోరింది. 22 నుంచి ఆగస్టు 9 వరకు పార్లమెంట్ ఎదుట ప్రతిరోజూ ధర్నా కొనసాగుతోంది. ప్రతిరోజూ 200 మంది రైతు వాలంటీర్లు, నాయకుల బృందాలు ఎస్కేఎం నిర్దేశించిన క్రమశిక్షణ మార్గదర్శకాలను అనుసరించి శాంతియుతంగా పార్లమెంట్ హౌస్ వైపు కవాతు చేస్తారు. జూలై 26, ఆగస్టు 9న మహిళా రైతులు ప్రత్యేక పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తారు. వారి జీవనోపాధి, భవిష్యత్తు కోసం రైతుల ఈ సుదీర్ఘ, చారిత్రాత్మక పోరాటంలో మహిళా రైతులు ముందంజలో ఉన్నారు. ఈ రెండు రోజులలో జరిగే ప్రత్యేక కవాతులు మహిళలు పోషించిన ప్రత్యేకమైన, చిరస్మరణీయ పాత్రను హైలైట్ చేస్తుంది.
'విమర్శ' రాజద్రోహం కాదు : సుప్రీం
రాజద్రోహ చట్టాన్ని సవాలు చేస్తూ తాజాగా దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఎస్.జి. వాంబాత్కరే (రిటైర్డ్) ఈ పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్)లో రాజద్రోహం చట్టం ఇప్పటికీ తన ఉనికిని చాటుకోవడానికి 60ఏండ్ల నాటి తీర్పే కారణం. ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందని పిటిషనరు వాదించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసుపై గురువారం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. తన ఫిర్యాదు ప్రతిని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌కి అందజేయాల్సిందిగా మేజర్ జనరల్ ఎస్.జి.వాంబాత్కరే (రిటైర్డ్)ని కోరింది. 1962లో కేదార్నాథ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వలసవాద కాలం నాటి అవశేషమైన సెక్షన్ 124ఎ (రాజద్రోహం)ను సమర్ధించింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై ''చిల్లింగ్ ఎఫెక్ట్'' వంటి సిద్ధాంతాలు, సూత్రీకరణలను వినిపించుకోని కాలం అది. చిల్లింగ్ ఎఫెక్టు అంటే భావ ప్రకటనా స్వేచ్ఛకు మానసిక అవరోధాలు కల్పించడం. అప్పటికి ఆ సిద్ధాంతం పెద్దగా అభివృద్ధి చెందలేదు. అమెరికాలో కూడా 1967 తరువాతే ఇది ఒక సిద్ధాంత రూపాన్ని సంతరించుకుంది. 2015 నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛపై ఈ చిల్లింగ్ ఎఫెక్టు ఎక్కువగా ఉంది.'శ్రేయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసుతో ఇది మరోసారి ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది అని పిటిషనర్ పేర్కొన్నారు. కేదార్నాథ్ తీర్పు వెలువడే కాలం నాటికి సమానత్వం, పరువు, ప్రతిష్ట వంటి ప్రాథమిక హక్కుల మధ్య అంతఃసంబంధం తగినంతగా విస్తరించడానికి బదులు కుదించబడింది అని పిటిషనర్ వాదించారు. సెక్షన్ 124ఎ లేకపోతే, ప్రభుత్వం ప్రతిష్టంభనలో పడినపుడు యావత్ దేశం అనిశ్చితిలో పడదా అని కోర్టు ప్రశ్నించింది. హింసను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు లేదా ప్రసంగాలను రాజ ద్రోహం నేరంగా పరిగణించాలని ఈ సెక్షన్ పేర్కొంటున్నది. నేడు ఈ తీర్పును ఒక దిక్సూచిగా పరిగణించలేమని పిటిషనర్ వాదించారు. స్వలింగ సంపర్కం నేరపూరితం కాదని, గోప్యతను ప్రాధమిక హక్కుగా ప్రకటిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషనర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇన్నేళ్ల కాలం లో మార్పులు ఎలా వస్తున్నాయో కాలం, ధోరణులు ఎలా మార్పు చెందుతు న్నాయో చెప్పడానికి ఇవే నిదర్శనమన్నారు. రాజ్యాంగమనేది ఒక ప్రామాణిక పత్రం. చట్టం అభివృద్ధిపరచడం, కాలంతో పాటు ముందుకు నడుస్తూ, రాజ్యాంగ నిబంధనలకు బాష్యం చెపాల్సి వుంటుందని పిటిషనర్ పేర్కొన్నారు.