Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసిలో వచ్చే మార్చి కల్లా వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకున్నది. 2022 మార్చికల్లా స్టాక్ ఎక్సేంజీల్లో ఎల్ఐసీ షేర్ల నమోదు పూర్తవుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. అతి త్వరలోనే ఈ ఐపీఓ నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం పూర్తవుతుందన్నారు. ఈ ఐపీఓ ద్వారా ఎల్ఐసీలోని దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది.