Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1500 కోట్లు విలువైన ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవాలు
- యోగి సర్కారుపై ప్రశంసలు
న్యూఢిల్లీ: యూపీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రధాని మోడీ వరాలు ప్రకటించారు. 1500 కోట్ల మేర విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.నిన్న మొన్నటి దాకా యోగిపై చిర్రుబుర్రులాడిన మోడీ యోగి సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి ఇప్పటి వరకూ కేటాయించిన పలు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిఉన్నాయి. తాజాగా మరికొన్ని పనులకు పచ్చజెండా ఊపారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోడీ గురువారం పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. వారణాసిలో భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. జపాన్ సాయంతో, ఉన్నత కళానైపుణ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు వెల్లడించారు. రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుందనీ, భారత్-జపాన్ స్నేహ బంధానికి ఇది ఓ నిదర్శనమన్నారు. ఈ పర్యటనలో మోడీ రూ.1500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిలో గొగౌలియా వద్ద బహుల స్థాయి పార్కింగ్, పర్యాకట అభివృద్ధికి రో-రోలు, వారణాసి-ఘాజీపూర్ హైవేపై మూడు లేన్ల ఫ్లైఓవర్ వంతెన ఉన్నాయి. ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ ఆఫ్ బీహెచ్‌యూలో 100 పడకల ఎంసీహెచ్ విభాగాన్ని ప్రారంభం అనంతరం మోడీ మాట్లాడుతూ.. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ పోరులో యూపీ సమర్థవంతంగా పోరాడిందన్నారు. కాశీ నగరం త్వరలో మెడికల్ హబ్‌గా మారనుందనీ, ఇక నుంచి వైద్యసేవల కోసం ఢిల్లీ, ముంబయి వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరముండదని అన్నారు. కాగా, యూపీలో ఇప్పటివరకు మొత్తం 17 లక్షలకు పైగా కరోనా కేసులు, 22 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.