Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ : దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమ్మిళిత ఆర్థికాభివృద్థి కీలకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. ఇందుకోసం భారత్ సుదీర్ఘ ప్రయాణం సాగించిందన్నారు.
అట్టడుగు వర్గాలకూ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవడం, ఆర్ధిక ఉత్పత్తులను చేరవేయడం ద్వారా సమ్మిళిత ఆర్ధిక వద్ధి దిశగా అడుగులు పడ్డాయని గురువారం ఆయన ఓ మీడియాతో పేర్కొన్నారు. కరోనా రెెండో దశ తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో భవిష్యత్తు రోజుల్లో భారత ఆర్ధిక వ్యవస్ద గాడినపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా రెండో దశతో తయారీ, సేవల రంగం రికవరీకి విఘాతం కలిగిందన్నారు.