Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్ అధినేతపై పరివార నేతల తిరుగుబాటు.
ఆగ్రా: యూపీ ఎన్నికల్లో లబ్దికోసం మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సంఫ్‌ు పరివార్‌లోని వారే వ్యతిరేకిస్తున్నారు. ఘజియాబాద్‌లో జూలై 4న జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో ప్రసంగించిన మోహన్ భగవత్.. 'భారతదేశంలోని అన్ని మతాల వారిది ఒకే డిఎన్ఏ' అని వ్యాఖ్యానించారు. ముస్లిములకు హాని తలపెట్టే మాటలు మాట్లాడే వారు హిందువులే కాదంటూ.. గోహత్య పేరిట ముస్లింలపై దాడులు చేయడం హిందూత్వ వ్యతిరేకమేనని భగవత్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై సంఘపరివార్ అనుచరగణం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. హిందూ మతానికి మోహన్ భగవత్ యజమానేమీ కాదు, ఆయన అభిప్రాయాలతో మేం విభేదిస్తున్నామని యతి నర్సింహానంద తెలిపాడు. 'ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ డీఎన్ఏ ఔరంగజేబుది కావచ్చు. మాది మాత్రం ఉమ్మడి డీఎన్ఏ కాదు' అన్నారు. తాగునీటి కోసం హిందూ ఆలయంలోకి ప్రవేశించిన ఒక ముస్లిం బాలుడి పై దాడి చేసి కొట్టడాన్ని.. గతంలో ఈ పూజారి గట్టిగా సమర్ధించాడు. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన మరో నేత సాధ్వి ప్రాచీ సైతం మోహన్ భగవత్‌తో విభేదించింది. ''అందరిదీ ఒకే డిఎన్ఏ అంటే మేము ఒప్పుకోము.. గోమాంసం తినేవారి డిఎన్ఏ వేరుగా ఉంటుంది'' అంటూ ఆమె ప్రకటించారు. కాగా, 'ఆరెస్సెస్ నాయకులు మతోన్మాదం అనే పులి మీద స్వారీ చేసి.. ఇప్పుడు స్వారీ చాలు, దిగిపోతానంటే.. ఆ పులి ఒప్పుకుంటుందా?' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విస్తృతంగా కామెంట్లు చేస్తున్నారు.