Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఐఏపై బృందకరత్ విమర్శలు
రాంచీ : స్టాన్ స్వామి హత్య తరువాత ఎన్ఐఏ పేరును నేషనల్ క్రిమినల్ ఏజెన్సీగా మార్చుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందకరత్ విమర్శించారు. స్టాన్ స్వామికి హత్యకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల, ఎన్జిఓలు, విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు రాంచీలో గురువారం రాజ్‌భవన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో బృందకరత్తో సహా ఇతర వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. స్టాన్ స్వామి హత్యపై న్యాయవిచారణ జరిపించాలనే డిమాండ్‌తో గవర్నర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఉపా చట్టం పేరుతో అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలందర్నీ విడిచిపెట్టాలని, అలాగే మావోయిస్టుల అరికట్టడం పేరుతో జార్ఘండ్ జైళ్లలో నిర్భంధించిన అమాయకులైన గిరిజన, దళితలను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.