Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాను పూర్తిగా నియంత్రించగలం : తమిళనాడు బీజేపీ నూతన చీఫ్
చెన్నై : తమిళనాడు బీజేపీ నూతన చీఫ్గా నియమితులైన కే. అన్నమలై 'మీడియా'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో మీడియాను నియంత్రణలోకి తీసుకురాగలమని ఆయన అన్నారు. కోయంబత్తూరు నుంచి చెన్నై వరకు రోడ్ షోలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి పై విధంగా స్పందించారు. తమిళనాడుకు బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్ మురుగన్.. ప్రస్తుతం కేంద్ర సమాచారా, ప్రసార శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నమలై మీడియాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ''ఎల్. మురుగన్.. ప్రస్తుతం కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సహాయ మంత్రిగా ఉన్నారు. మీడియా మొత్తం ఆయన శాఖ కిందకే వస్తుంది. ఇకపై మీడియా తరచూ తప్పుడు వార్తలను చూపించలేదు. వాటిని రాజకీయాలకు వాడలేరు'' అని అన్నమలై అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలను తమిళనాడు ఐటీ మంత్రి మనో తంగరాజ్.. ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మీడియాను భయపెట్టేలా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులుగా ఎవరు వచ్చినప్పటికీ.. అందరి తీరూ వివాదాస్పదంగానే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.