Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: వీఐటీ-ఏపీి విశ్వవిద్యాలయం, స్కిల్ లింక్ మధ్య ఒప్పందం కుదిరింది. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం పెంచేందుకుగాను వీఐటీ ఈ మేరకు ఈ నెల 16న ఒప్పందం కుదుర్చుకున్నది. స్కిల్-లింక్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఎస్ వి కోటారెడ్డి మాట్లాడారు. ఈ సహకారం అధ్యాపకులకు, విద్యార్థులకు స్కిల్-లింక్ శిక్షణతోపాటు, ధ్రువపత్రం పొందడానికి సహాయపడుతుందని అన్నారు. విద్యార్థులు కోర్సును విజయవంతంగా పూర్తిచేయడానికి సమగ్ర అభ్యాస నిర్వహణ వ్యవస్థతో క్రమానుగుణంగా స్కిల్-లింక్ కషి చేస్తుందని తెలిపారు. వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ అనే ప్రత్యేకమైన పాఠ్యప్రణాళిక ద్వారా విద్యార్థులకు ఇటువంటి కోర్సులు, ధ్రువపత్రాలను ఎన్నుకోవటానికి, వారి పాఠ్యాంశాల్లో భాగంగా క్రెడిట్లను సంపాదించడానికి వీలు కల్పిస్తుందని తెలియచేసారు.కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలలో ప్రస్తుత, భవిష్యత్ సాంకేతిక విజ్ఞానానికి తగ్గట్టు ఆన్లైన్ కోర్సులను అందించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఈ అవగాహన ఒప్పందం సహాయపడుతుందని స్కిల్-లింక్ సిఇఓ Ê కో-ఫౌండర్ సూర్యనారాయణ్ పనీర్సెల్వన్ అన్నారు. మారుతున్నా కాలానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు వారిని సిద్ధం చేస్తామన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి వీఐటీి-ఏపీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా|| సిఎల్వి శివకుమార్ మరియు డీన్ వీఐటీి-ఏపీ స్కూల్ మెకానికల్ ఇంజనీరింగ్ డా|| పి.ఎస్. రమా శ్రీకాంత్ , స్కిల్ లింక్ మేనేజర్, ఇండిస్టీ అకాడెమియా పార్టనర్షిప్ మయంక్ రంజన్ , అనుష అశోక్, అధ్యాపక సభ్యులు , విశ్వవిద్యాలయ సిబ్బంది హాజరయ్యారు.