Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాస్తవికతను కప్పిపుచ్చే యత్నం
- గుజరాత్లో గోడలు కడితే.. వారణాసిలో పరదాలు
గుజరాత్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు వచ్చినపుడు.. మురికి వాడలు, పేదలు కనిపించకుండా గోడలు కట్టారు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీలో వాస్తవికతను కప్పిపుచ్చటానికి యోగి సర్కార్ పరదాలు కప్పేసింది. ఇప్పటికీ అక్కడ అభివృద్ధి అస్తవ్యస్తంగా ఉంటే.. యూపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. 1500 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శిలాఫలకాలువేశారు. అభివృద్ధి జరిగిఉంటే.. మోడీకి కనిపించకుండా పరదాలు ఎందుకు కట్టాల్సి వచ్చిందని ప్రజలు, పౌరసమాజం ప్రశ్నిస్తున్నది.
లక్నో : యోగి, మోడీల మధ్య పొసగటంలేదు. ఇద్దరి మధ్యా ఢిల్లీలో రాజీకుదిరాక.. మోడీ కాశీయాత్ర ఖరారైన విషయం విదితమే. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో వారణాసి నగరం రూపురేఖలు మారిపోయాయి. ఓపెన్ డ్రైయిన్లు, దుర్గంధభరితమైన వాతావరణం స్థానికుల్ని పీడిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని షెడ్యూల్ ఖరారు కాగానే గుంతలపై మట్టి, తారు పోసి అతుకు లుదిద్దారు. అయితే అభివృద్ధి ఆనవాళ్ల కన్నా.. అధ్వా న్నంగా ఉన్న వాటిని చూస్తే మోడీకి ఎక్కడ కోపం వస్తుం దనుకున్నారో కానీ.. పేదలుండే ప్రాంతాల్లో ఉన్న వాస్తవికత కనిపించకుండా పరదాలు కప్పేయాలని యోగి సర్కార్ ఆదేశించింది. వెంటనే అధి కారులు అఘమేఘాలపై ముసుగులు కప్పేశారు. బనారస్ కు ప్రధాని మోడీ వచ్చి.. ఒక్క బటన్‌తో రూ.1475 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. సిగ్రాలోని ప్రసిద్ధ రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించాల్సి ఉండగా ముఖ్యంగా సిగ్రా నుంచి ఫాట్‌మాన్ రోడ్ వరకు.. ఇక్కడ పారే మురుగుకాల్వల చుట్టూ పరదాలు కప్పేశారు. రోడ్లపై చిన్న గుంత కూడా కనిపించకుండా ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేశారు. ఇక్కడే కాదు.. సంపూర్ణానంద్ సంస్కృత విశ్వ విద్యాల యం పరిసరాల్లో ఉన్న ఓపెన్ డ్రైన్, దుమ్ము, ధూళి తో నిండిన రోడ్లు అక్కడి ప్రజలను కంటిమీద కునుకులేకుం డా చేస్తున్నాయి. వర్షాకాలంలో.. ఈ కాలువ మురుగు నీటి తో ఉప్పొంగుతున్నది. దీంతో తెలియాబాగ్, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కొలనులుగా మారుతాయి. లోతట్టు ప్రాంతా ల్లోని జనం పడే కష్టాలు వర్ణనాతీతం. మోడీ వస్తున్నారనే తెలియగానే.. ఇక్కడి కాలువను బ్యూరోక్రసీ పూర్తిగా కవర్ చేసింది.ప్రధానిని తప్పుదారి పట్టించటానికి బ్యూరోక్రసీ వాస్తవికతను దాచే ప్రయత్నం చేసిందని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్‌కుమార్ అన్నారు. ఈ పరదాల వెనుక పేదల కష్టాలు మోడీ చూడాలని బ్యూరోక్రసీ కోరుకోవటంలేదన్నారు. యోగి సర్కార్ తలుచుకుంటే నీరు లేని చోట సముద్రం, పచ్చదనంలేని అడవిని చూపిస్తుంది. దీపాల్లేని చోట లేజర్ లైట్లు ఏర్పాటు చేసి మాయ చేయటంలో బ్యూరోక్రసీ యోగికి మెహర్బానీ చాటుకున్నదని ప్రదీప్ తెలిపారు.
రుద్రాక్ష సామాన్యులకు కాదు!
మున్సిపల్ ఆడిటోరియం, మినీ సదన్ ఉన్న ప్రదేశంలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. ఆడిటోరియం ఉన్నంతవరకు, సామాన్యులు సులభంగా అక్కడికి వెళ్లేవారు. ప్రయివేట్ కార్యక్రమాలకు కూడా హాల్ బుక్ చేసేవారు. ఇప్పుడు దీని కోసం భారీ రుసుం చెల్లించాలి. రుద్రాక్షలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే, వాహనాలు ఇక్కడికి వెళ్లడానికి చట్టపరమైన మార్గం లేనందున, నగరం మొత్తం జామ్‌లో ఇరుక్కుపోతుందని స్థానికులు చెబుతున్నారు. 'ఏదైనా నిర్మించాల్సి ఉంటే, అది సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించాలి. కన్వెన్షన్ సెంటర్ సామాన్యులకు పనికిరాని విధంగా ఎత్తైన, విలాసవంతమైనదిగా కట్టారు. ఇది పెద్దలకే ఉపయోగపడు తుంది' అని ఎస్పీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా విమర్శించారు.
మోడీ అభివృద్ధి నినాదం..చిలుక పలుకులే..
మోడీ చెబుతున్న అభివృద్ది నినాదం కేవలం చిలుక పలుకులే. బీజేపీ ప్రకటనలు ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడకుండా, తప్పుడు ప్రచారాన్ని చూపుతున్నాయి. గతంలో మినీ సదన్ సమావేశంలో బనారస్‌లో అభివృద్ధి పనులపై చర్చించేవారు. విధానాలు నిర్ణయించారు.. ప్రజా సౌకర్యాల గురించి ప్రణాళికలు రూపొందించారు, ఇది మోడీశకంలో ముగిసింది. మునిసిపల్ కార్పొరేషన్ స్థలాన్ని పట్టుకునే ముందు, సభ్యులను కూడా అడగలేదు. ఈ రుద్రాక్ష సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో ఎవరూ చెప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాజేష్ మిశ్రా విమర్శించారు. బనారస్‌ను మోడల్ సిటీగా మార్చటానికి.. వేలాది మంది అంధులను తొలగించారు.
దుర్గాకుండ్‌లో ఉన్న పూర్వంచల్ మొదటి, చివరి అంధ పాఠశాలను మూసేశారు.ఇపుడు వాటిస్థానంలో.. ఉన్న అంధ పాఠశాలను ఆకాశహర్మ్య వాణిజ్య భవనాలతో కలపడం ఆశ్చర్యకరం. బనారస్‌లోని దుర్గాకుండ్‌లో ఉన్న హనుమాన్ ప్రసాద్ పోద్దార్ బ్లైండ్ స్కూల్లో సుమారు 100 కోట్ల విలువైన ఆస్తిని వాణిజ్యపరంగా ఉపయోగించాలని నిర్ణయించింది.ఇప్పుడు వేలాది మంది విద్యార్థుల జీవితాలు చీకటిలో తిరుగుతు న్నాయి. విపత్తులో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పాఠశాల యొక్క ధర్మకర్తలుగా చెప్పబడే 18 మంది పారిశ్రామికవేత్తలు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. కరోనా కాలంలోనే 2020 జూన్ 20న పాఠశాలను శాశ్వతం గా మూసివేశారు. తమకు ఎలాంటి ప్రభుత్వ సహాయం అందటం లేదని ధర్మకర్తలు ఆరోపించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటానికి యోగి సర్కార్ ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
వివాదాల్లో రుద్రక్ కన్వెన్షన్ సెంటర్
మోడీ ప్రారంభించిన రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి వివాదాలు ఉన్నాయి. దీన్ని నిర్మించిన స్థలం మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన స్థలం. అంతకుముందు ఇక్కడ మునిసిపల్ కార్పొరేషన్ ఆడిటోరియం ఉండేది. అనుబంధంగా మినీ సదన్ హాల్ కూడా ఇక్కడ ఉన్నది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అభివృద్ధి ఆరోపణల మధ్య మునిసిపల్ కౌన్సిలర్ల సమ్మతిని పొందవలసిన అవసరాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగినప్పుడల్లా మినీ సదన్‌లో చర్చిం చాల్సిన అవసరం ఉన్నది. మోడీ బనా రస్ ఎంపీ అయిన ప్పటి నుంచి అభివృద్ధి పనుల్లో నిబంధనలకు పాతరేస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.