Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హర్యానాలోని సిర్సాలో రైతుల ఆందోళన రెండోరోజైన ఆదివారం కొనసాగింది. అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలనీ, రాజద్రోహం కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిర్సాలో రైతులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఆదివారం పోలీసులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వెనక్కితగ్గే ప్రసక్తేలేదని రైతులు స్పష్టం చేశారు. ఆదివారం నుంచి నిరవధిక నిరాహార దీక్షలూ ప్రారంభమయ్యాయి. అరెస్టు చేసిన ఐదుగురు రైతులను వెంటనే విడుదల చేయాలనీ, రాజద్రోహం కేసులతో సహా అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. రైతులపై రాజద్రోహం వంటి కేసులు పెట్టి,పబ్బం గడుపుకోవాలని హర్యానా సర్కార్ భావిస్తున్నదని రైతు నేతలు ఆరోపించారు. అందుకే అక్రమకేసులు బనాయిస్తున్నదని చెప్పారు. తొమ్మిది మంది ఎస్కేఎం సభ్యుల సమన్వయ కమిటీ ఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ తో సమావేశమై, వర్షాకాల పార్లమెంట్ సమావేశ రోజుల్లో పార్లమెంట్ ఎదుట నిరసనకు సంబంధించి ప్రణాళికలను తెలియజేసింది. మరోవైపు ఎస్కేఎం పార్లమెంట్ నిరసనలకు సన్నాహాలు జోరందుకున్నాయి. పార్లమెంటులో ప్రతి పని దినం సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది రైతుల బృందం నిరసనలు చేపట్టనున్నది.