Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో ఘటన..బతికి బయటపడ్డ చోదకులు
న్యూఢిల్లీ: ముంబయి లో భారీ వర్షాలతో చిన్న నీటి గుంత ఓ కారును లోపలికి లాక్కున్న ఘటన మరువక ముందే.. అచ్చం అలానే సోమవారం ఢిల్లీలోని రోడ్డు లోకి ఓ కారు పూర్తిగా దిగబడిపోయింది. దేశ రాజ ధాని నగరంలో భారీ వర్షాల తో రోడ్లన్నీ తడిసి ముద్ద య్యాయి. ద్వారకాలోని సెక్టార్- 18లో రోడ్డు గుంత లా మారడంతో కారు లోపలి కి జారిపోయింది. క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీసుకొచ్చినట్టు పోలీసులు వెల్లడిం చారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఫొటోలు తీశారు. ఈ దశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఢిల్లీలో రోడ్ల నాణ్యతపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.