Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడులు ఉపసంహరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు సోమ వారం లోక్‌సభలో ఎంపీలు రవి కిషన్, సంగం లాల్ గుప్తా, సుబ్రాత్ పథక్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగ్వాత్ కిషన్‌రావు ఖరడ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌తో పాటు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానం కింద 2021 ఫిబ్రవరి 4న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా జరుగుతుందని తెలిపారు. ఈ నూతన విధానాన్ని 2021 జనవరి 27న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. ఈ విధానం ప్రకారం ప్రస్తుత ప్రభుత్వరంగ సంస్థలను వ్యూహాత్మక, వ్యూహరహిత రంగాలుగా వర్గీకరించామని తెలిపారు. వ్యూహాత్మక రంగాల్లో హౌల్డింగ్ కంపెనీ స్థాయిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల కనీస ఉనికిని ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలని కూడా నిర్దేశించినట్టు మంత్రి తెలిపారు. వ్యూహాత్మక రంగంలో మిగిలిన సంస్థలు ప్రయివేటీకరణ, విలీనం, మరొక ప్రభుత్వరంగ సంస్థతో అనుబంధంగా, మూసివేత వంటివి పరిగణిస్తామని పేర్కొన్నారు. ఇంకా, వ్యూహత్మకరహిత రంగాలలోని ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటీకరణ చేస్తామని తెలిపారు. ప్రయివేటీకరణ సాధ్యం కాకపోతే, అటువంటి సంస్థలు మూసివేస్తామని అన్నారు.