Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ఐదేండ్లలో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు: రాజ్యసభలో కేంద్ర మంత్రి కృష్ణ పాల్ గుర్జార్
న్యూఢిల్లీ : దేశంలో కొత్త ప్రభుత్వ రంగ సంస్థల(పీయస్యూ) ఏర్పాటుకు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణ పాల్ గుర్జార్ తెలిపారు. అలాగే గత ఐదేండ్లలో ఒక్క పీయస్ యూను కూడా ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభ లో రాజస్థాన్‌కు చెందిన ఎంపీ నీరాజ్ డాంగీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. పరిశ్రమలు రాష్ట్ర జాబితాకు చెందిన అంశమనీ, కనుక దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థాపించిన పీయస్యూలకు సంబంధించిన కేంద్రీకత డేటాను భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) నిర్వహించదని తెలిపారు. గత ఐదేండ్లలో ఎంహెచ్ఐ ఒక్క పీయస్యూను కూడా ఏర్పాటు చేయలేదనీ, కొత్త పీయస్యూల ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదనా లేదని పేర్కొన్నారు.