Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిస్పూర్ : ఒకే వ్యక్తి రెండు వేరియంట్ల బారిన పడిన ఘటన దేశంలో వెలుగులోకి వచ్చింది. అసోంకు చెందిన ఓ మహిళా వైద్యురాలికి ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్టు పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. భారత్లో ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసని వైద్యులు స్పష్టం చేశారు. ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వద్ధురాలు ఈ డబుల్ ఇన్ఫెక్షన్కు గురైన సంగతి తెలిసిందే.ఈ అంశంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కు చెందిన అధికారి మాట్లాడుతూ.. అసోం మహిళా వైద్యురాలు ఒకే సమయంలో రెండు వేరియంట్లు బారినపడినట్టు గుర్తించామన్నారు. ఆమె నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్టు గుర్తించామని, దీనిపై స్పష్టత కోసం మరోసారి నమూనాలు సేకరించామని అన్నారు. వాటిలోనూ ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్టు స్పష్టమైందని చెప్పారు. ఈ రెండు వేరియంట్లు ఒకేసారి సోకవచ్చు లేదా ఒక వేరియంట్ సోకిన రెండు, మూడు రోజుల వ్యవధిలో మరో వేరియంట్ దాడి చేయవచ్చని అన్నారు. మొదట ఆమె భర్త ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారనీ, ఆయన కూడా వైద్యులేనని అన్నారు.