Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి, లాక్డౌన్ పరిస్థి తులు ప్రతి వ్యవస్థనూ చిన్నా భిన్నం చేశాయి. ముఖ్యంగా లాక్డౌన్.. ప్రజలకు సంబం ధించిన వాణిజ్య, వ్యాపారాల మీద మాత్రమే కాదు చిన్నారుల మానసిక స్థితి పైనా నెగెటివ్ ఎఫెక్ట్ చూపింది. క్యాంపెయిన్ అగైనెస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ (సీఏసీటీ), భూమికా-విహార్ అనే పౌర సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బీహార్లోని 15 జిల్లాల నుంచి 1000 మంది పిల్లలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఈ సర్వే ప్రకారం.. కోవిడ్-19 ఫలితంగా విధించిన లాక్డౌన్.. చిన్నారులను ఇండ్లకే పరిమితమయ్యేలా చేసింది. గతేడాది తొలి లాక్డౌన్ సమయంలో బాలుర కంటే బాలికలే పాఠశాలలకు వెళ్లడానికి ఎక్కువ ఆసక్తిని కనబరిచారు. పాఠశాలలు తెరుచుకోగానే తిరిగి తరగతులు హాజరవుతామని దాదాపు 90 శాతం మంది బాలికలు తెలిపారు. అలాగే, 68 శాతం మంది తమ పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో ఇండ్లకు పరిమితం కావడం పట్ల ప్రత్యేకించి బాలురు అసహనాన్ని వ్యక్తం చేశారు. సర్వేలో భాగంగా దాదాపు 3400 మంది నుంచి (వీరిలో 1000 మంది చిన్నారులు) అభిప్రాయాలు సేకరించినట్టు సీఏసీటీ, భూమిక-విహార్ చీఫ్ ప్రాంతీయ కన్వీనర్ శిల్పిసింగ్ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలు, అగ్ర కులాలకు చెందిన కుటాంబాలున్నాయని వెల్లడించారు. '' సర్వేలో అభిప్రాయలు వెల్లడించినవారిలో 69 శాతం మంది పాఠశాలలకు వెళ్లేవారే. వీరిలో 24 శాతం మంది.. తమ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం వల్ల వారి నుంచి సహకారం అందకపోవడంతో ఇంటి వద్ద తాము ఏమీ నేర్చుకోలేకపోతున్నామని చెప్పారు'' అని ఆమె తెలిపారు. '' మొదటి లాక్డౌన్ సమయంలో 51 శాతం మంది బాలికలు ఇండ్లలో తమ తల్లిదండ్రులకు ఇంటి పనిలో సహాయపడ్డారు. దాదాపు 45 శాతం మంది చిన్నారులు లాక్డౌన్ సమయంలో ఇండ్లకే పరిమితం కావడం పట్ల ఎదురైన అసౌకర్యాన్ని వ్యక్తం చేశారు. కరోనా చిన్నారుల మానసికి స్థితిపై బలమైన ప్రభావం చూపినట్టు మేము కనుగొన్నాం'' అని శిల్పి తెలిపారు.