Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మరణాలు 40 లక్షలకు పైనే !
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగు తూనే ఉంది. నిత్యం వందలమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయితే, ప్రభుత్వం కరోనా మరణాలకు సంబం ధించి వాస్తవా లను దాస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా భారత్లో కరోనా కారణంగా చనిపోయింది 4.14లక్షల మందికాదు 40 లక్షలకు పైనే అంటూ దిగ్భ్రాంతికర విషయాలను ఓసర్వే వెల్లడించింది. దేశ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణి యన్తోపాటు సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు ఈసర్వే చేశారు.