Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు 'కిసాన్ సంసద్' నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి ప్రతి రోజు 200 మంది రైతులు జంతర్ మంతర్లో కిసాన్ సంసద్ నిర్వహించనున్నట్టు ఎస్కేఎం నేతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.