Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెగాసస్‌పై దద్దరిల్లిన పార్లమెంట్
- చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షాలు
- ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు
- ఉభయ సభలు వాయిదా
- జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి
- మోడీ, షాలు రాజీనామా చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను 'పెగాసస్' వ్యవహారం కుదిపే స్తున్నది. హ్యాకింగ్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతూ ఆందోళన లకు దిగాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు చేబూని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల హోరెత్తించారు. పెగాసస్‌పై జాయింట్ పార్ల మెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, హో మం త్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్ది నిమిషాలకే ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. వర్షాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష సభ్యులు 'పెగాసస్' అంశాన్ని లేవనెత్తారు. హ్యాకింగ్ వ్యవహారంపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. ప్రతిపక్ష ఎంపీలు సీట్ల నుంచి బయటకు వచ్చి నినాదాలు హోరెత్తించారు. వెల్‌లోకి దూసుకెళ్లి పోడియంను చుట్టుముట్టారు. సభను కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరారు. అయిన్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో నాలుగు నిమిషాలకే సభ వాయిదా పడింది. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయి దా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతి పక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభను మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.
అనంతరం ప్రారంభమైన సభలో పరిస్థితి ఏ మాత్రం మార్పు రాకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. ఆందోళనల నడుమే చైర్మెన్ వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అయితే దాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నంచేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చైర్మెన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభ మధ్యాహ్నం 1 గంటకు వాయిదా పడింది. తరువాత ప్రారంభమైన సభలో గందరగోళం నెలకొనడంతో వెంటనే 1.15 గంటలకు వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కరోనాపై స్వల్పకాలిక చర్చ జరిగింది.