Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) తమిళనాడులో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్నది. అయితే, నీట్ విషయంలో తమిళనాడులోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మాత్రం అంతగా సానుకూల స్పందన రావడంలేదు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులపై నీట్ ప్రభావం గురించి అధ్యయనం చేయడానికి జూన్ 10న తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం సదరు కమిటీ నీట్‌పై తమిళనాడు ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపు 86,342 మంది ప్రజలు కమిటీకి తమ అభిప్రాయాలను వెల్లడించారు.. నీట్ విషయంలో కల్వి పాదుగప్పు కూటమైప్పు (ఫెడరేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. 87.1 శాతం మంది ప్రజలు ప్రవేశపరీక్షను వ్యతిరేకించారు. ఇక 90.5 శాతం మంది మాత్రం నీట్.. తమిళనాడుకు చాలా ప్రమాదకరమని భావించారు.