Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఉదిత్ రాజ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీలకు ప్రయివేటు రంగంతోపాటు న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ, ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ (ఏఐసీఎస్ఓ) చైర్మెన్ డాక్టర్ ఉదిత్ రాజ్ డిమాండ్ చేశారు. ఏఐసీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్ రాజ్ అధ్యక్షతన హైదరాబాద్లో బుధవారం సమానత్వం కోసం ఐక్యత అనే అంశంపై మేధోమధన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఉదిత్ మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. విదుతలై చిరుతగల్ కచ్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ తిరుమవలవన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు రాజకీయంగా ఎదిగే సమయం ఆసన్నమైందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కలలను సాకారం చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.