Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల అనంతర హింస దర్యాప్తుపై రాష్ట్ర హైకోర్టు
కోల్కతా : రాష్ట్రంలలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన దర్యాప్తు విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కలకత్తా హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రత్యర్థులపై తృణమూల్ కార్యకర్తలు దాడులకు దిగినట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే, ఈ హింసాత్మక ఘటనలు, అల్లర్ల విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అధికార తృణమూల్ కాంగ్రెస్, మమత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనేక ఫిర్యాదులు చేశాయి. కాగా, హింసాత్మక ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం సక్రమంగా దర్యాప్తు జరపకపోవడంతో విచారణ కార్యకలాపాలు ప్రతికూలంగా మారాయాని ఐదుగురు సభ్యులు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఇటీవల ఒక నివేదికను న్యాయస్థానానికి అందించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఇందులో తీవ్రంగా విమర్శించింది. హింసాత్మక ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో దర్యాప్తు జరిపించాలని వివరించింది. కాగా, ఈ నివేదికపై సమాధానాన్ని ఈనెల 26 నాటికి తెలియజేయాలని మమతా సర్కారును హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.