Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ గురువారం భారత మార్కెట్లోకి తన హ్యాచ్‌బ్యాక్ ఫిగోలో ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఫిగోలో ఇప్పటివరకు కేవలం మాన్యువల్, గేర్ బాక్స్ ఆప్షన్ కార్లను మాత్రమే విక్రయిస్తోంది. 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఆవిష్కరించిన ఆటోమెటిక్ వేరియంట్‌ను రూ.11,000తో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. దీని ప్రారంభ ధర రూ.7.75 లక్షలుగా ఉంది.