Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన తాజా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో స్పెషాలిటీ స్టీల్ కొరకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌కు ఆమోదం తెలిపారు. ఈ పథకం ఐదు సంవత్సరాల వరకు అమల్లో ఉంటుంది. 2023-24 నుంచి 2027-28 వరకు అమల్లో ఉండే ఈ పథకంలో భాగంగా రూ.6322 కోట్ల ప్రోత్సహకాలు అందించనున్నారు. ఈ పథకం సుమారు 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని, 25 మెట్రిక్ టన్నుల స్టీల్ సామర్థ్యానికి పెంచుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ రంగం నుంచి దేశీయ తయారీ, ఎగుమతులు పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. స్పెషాలిటీ స్టీల్ గ్రేడ్ల తయారు చేస్తున్న అన్ని సంస్థలు ఈ పథకానికి అర్హులని వెల్లడించారు.