Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ దేశాధినేతల క్షమాపణలు
- భారత్‌లో పరిస్థితి విభిన్నం
న్యూఢిల్లీ : యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కట్టడికి అన్ని దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు. పైగా వివిధ వేరియంట్లతో విరుచుకుపడుతూనే ఉంది. ఇలాంటి నేపధ్యంలో ప్రభుత్వాల చర్యలపై విమర్శలు ఎదురవుతున్న వేళ వివిధ దేశాధినేతలు విమర్శలకు తలొగ్గక తప్పలేదు. తమ దేశ ప్రజలకు క్షమాణాలు చెప్పారు. టీకా పంపిణీలో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు గానూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ క్షమాపణలు చెప్పారు.బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా క్షమాపణలు తెలిపారు. 'కరోనా వల్ల దేశ ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బాధలకు నేను క్షమాపణలు చెబుతున్నా. ప్రతిపక్ష ఎంపిల విమర్శలను హదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. జరిగిన దానికి క్షమాపణలు' అని బోరిస్ ప్రకటించారు.అలాగే, నెదర్లాండ్స్‌లోనూ ప్రభుత్వ నిర్ణయం వల్లే కేసులు పెరిగాయంటూ ఆరోగ్య సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో ఆ దేశా ప్రధాని మార్క్ రూట్ తాము తప్పుడు నిర్ణయం తీసుకున్నామని అంగీకరించారు. దక్షిణకొరియా ప్రధాని కిమ్ బూ కుమ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.కాగా, మరోవైపు భారత్‌లో పాలకుల పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.