Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజంతా రైల్వే బ్రిడ్జికి వేలాడిన బాలిక మృతదేహం
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 17 ఏండ్ల ఓ బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం రైల్వే వంతెన కింద వేలాడడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. దర్యాప్తు చేయగా, బాలిక జీవనశైలి నచ్చకనే ఆమె తాత, మామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 17 ఏడ్ల బాలిక తన తల్లితో కలిసి ఇటీవలే డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన మైనర్ బాలిక జీవనశైలి, జీన్సులు ధరించడం, ఆమె కుటుంబ నేపథ్యం తాతకు, మామలకు నచ్చలేదు. దీంతో బాలికపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే బాలిక తాతా రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్తో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కంగారుపడ్డారు. బాలిక కిందపడటంతో గాయాలయ్యాలయ్యాయనీ, దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని తల్లికి చెప్పారు. అయితే, మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీంతో నిందితులు.. మృతదేహన్ని డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చి కిందకు తోసేశారు. అయితే, బాలిక కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు బాలిక మృతదేహం అక్కడే వేలాడింది. స్థానికులు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసుకున్నామని దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.