Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో పిటిషన్
- స్పైవేర్‌ను కొనడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం
- కుంభకోణంలో పాత్ర ఉన్న నిందితులు, మంత్రులను విచారించాలని వినతి
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్‌తో ప్రభుత్వ సంస్థలు జర్నలి స్టులు, ఉద్యమకారులు, రాజకీయ నేతలు, ఇతరులపై నిఘా పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదే శించాలని సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేత దర్యాప్తు చేయించాలని పిటిషన్‌దారు కోరారు. ఈ స్పైవేర్ కొను గోలు కుంభకోణంలో పాత్ర ఉన్న నిందితులు, మంత్రు లను విచారించాలని కోరింది. అదేవిధంగా పెగాసస్ స్పైవేర్‌ను కొనడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించాలని కోరింది. పెగాసస్ కుంభకోణం చాలా తీవ్రమైనదని న్యాయవాది ఎంఎల్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థతో పాటు దేశ భద్రతలపై తీవ్రమైన దాడి అని తెలిపారు. వ్యక్తిగత గోప్యత అంటే దాచిపెట్టుకోవాలనే కోరికకు సంబంధిం చింది కాదనీ, సొంత ఆలోచనలతో కూడిన భావాలనీ, అవి వేరొకరి ప్రయోజనాలకు సాధనం కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం కేవలం సంభాషణలను చాటుగా వినడం మాత్రమే కాదనీ, ఒక వ్యక్తి మొత్తం జీవితానికి సంబంధించిన డిజిటల్ ఇంప్రింట్‌ను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చునని తెలిపారు. ఫోన్ యజమానిని మాత్రమే కాకుండా ఆ వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉండేవారందరి గురించి తెలుసుకోవడానికి దారి తీస్తుందని వివరించారు. త్వరలో కోర్టులో విచారణకు రానున్న ఈ పిటిషన్లో నిఘా సాంకేతికత విక్రేతలు పెద్దయెత్తున పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ భద్రత, మానవ హక్కుల సమస్య ఉత్పన్నమవుతుందనీ, తద్వారా జాతీయ భద్రతకు ఏర్పడే చిక్కులు అపరమైనవని హెచ్చరించారు.
ఇది ఒక సైబర్ ఆయుధం..
ఎన్ఎస్ఓ గ్రూప్ కంపెనీ క్లయింట్లు 2016 నుంచి దాదాపు 50 వేల ఫోన్ నంబర్లను టార్గెట్ చేశారనీ, ఆ మేరకు నంబర్ల జాబితా మీడియా సంస్థలకు లీక్ అయిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పెగాసస్ అనేది కేవలం నిఘా సాధనం మాత్రమే కాదనీ, ఇది సైబర్ ఆయుధమనీ, దీనిని భారత ప్రభుత్వ వ్యవస్థపై ప్రయోగిస్తున్నారని పిటిషన్ పేర్కొంది. దీనిని ఉపయోగించేందుకు అధికారం కల్పించినప్పటికీ(ఇది అనుమానం), దేశ భద్రతకు ముప్పు కలుగుతుందనేది స్పష్టమని అభిప్రాయప