Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ మంత్రి రాజీనామా చేయాలని కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్)లో రైతు నేతలు డిమాండ్ చేశారు. కిసాన్ సంసద్ నేపథ్యంలో జంతర్ మంతర్ సమీపం మొత్తం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. పార్లమెంట్‌కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్న అన్ని మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. మీడియాను రైతుల వేదిక వద్దకు అనుమతించటం లేదు. ఆంక్షల నడుమే కిసాన్ సంసద్ రెండో రోజు కొనసాగింది. సింఘూ సరిహద్దు నుంచి 200 వందల మంది రైతులు ఐదు బస్సుల్లో జంతర్ మంతర్ వద్ద సభా స్థలికి చేరుకున్నారు. శుక్రవారం కిసాన్ సంసాద్‌లో మూడు సెషన్లు జరిగాయి. స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లుగా ఆరుగురు వ్యవహరించారు. హర్దేవ్ సింగ్ హర్షి, జగ్తార్ సింగ్ బజ్వా, వి వెంకట రామయ్య, జంగ్వీర్ సింగ్ చౌహాన్, ము ఖేష్ చంద్ర, హర్పాల్ సింగ్ బిలారి స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లుగా కిసాన్ సంసద్‌ను నిర్వహించారు. ఉద్యమంలో మరణించిన అమరవీరులకు తొలుత నివాళులర్పించారు. ఏపీఎంసీ బైపాస్ చట్టంపై రెండు రోజుల చర్చ ముగింపులో కిసాన్ సంసాద్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. రాజ్యాంగాన్ని అణగదొక్కడం,చట్టం ఆధారంగా ప్రజాస్వామ్య పనితీ రును సూచిస్తూ కేంద్ర చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తీర్మానం పిలుపునిచ్చింది.రైతు ప్రయోజనాలను పరిరక్షించే తమ మండి వ్యవస్థలో మెరుగుదలలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
హర్యానాలో రైతులు పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
హర్యానాలో రైతుల పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలనీ, అక్రమంగా బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని సిర్సాలో గత ఐదు రోజులుగా రైతుల నిరాహార దీక్షలు, భారీ ఆందోళనలు విజయవంతం అయ్యాయి.