Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్సీయూ వీసీగా బసుత్కర్ జె.రావ్
న్యూఢిల్లీ : దేశంలోని 12 సెంట్రల్ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు.ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమో దం తెలిపినట్టు శుక్రవారం కేంద్ర విద్యా శాఖ తెలిపింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హర్యానా, హిమా చల్ ప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్, కర్నాటక, తమిళనాడు, గయాలోని దక్షిణ బీహార్, మణిపూర్ యూ నివర్సిటీ,మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ హిల్ యూని వర్సిటీ,బిలాస్పూర్ గురు ఘాసిదాస్ యూనివర్సిటీలకు వీసీల నియామకం జరిగింది. కర్నాటక సెంట్రల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సెలర్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణను నియమించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి డాక్టర్ బసుత్కర్ జె రావు నియమితులయ్యారు.