Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా కుంభకోణంపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్, సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు ఆందోళనకు దిగాయి. పెగాసస్ కుంభకోణంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరపాలనీ, ప్రధాని మోడీ మౌనం వీడాలనీ, వ్యక్తిగత గోప్యతను కాపాడాలనీ, హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు హోరెత్తించాయి. ''పెగాసస్ స్నూప్ గేట్'' అనే నినాదాలున్న ప్లకార్డులను ప్రదర్శించాయి. ఆందోళనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ, లోక్సభ పక్షనేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, నేతలు కెసి వేణుగోపాల్, శశిథరూర్, కనిమొళి (డీఎంకే), అరవింద్ సావంత్, ప్రియాంక చతుర్వేది (శివసేన), ఎన్కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), ఎలమారం కరీం (సీపీఐ(ఎం)), బినరు విశ్వం (సీపీఐ) తదితరులు పాల్గొన్నారు.