Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కొత్తగా విద్యుత్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. 2025 నాటికి మార్కెట్లోకి కొత్త విద్యుత్ వాహనాలను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో ఈ రంగంలోని టెస్లాకు తీవ్ర పోటీని ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే విధంగా 5.30 లక్షల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వచ్చే ఎనిమిదేండ్లలో ఇందుకోసం రూ.36 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుత తమ కార్ల మోడళ్లను విద్యుత్ కార్లుగా మార్పు చేయడానికి 2022 నాటికి ప్రణాళిక సిద్ధం చేస్తామని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది.