Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఏఐఎల్) కొత్తగా వినియోగదారుల అభివృద్థి ఫీజు (యూడీఎఫ్్)ను పెంచే ప్రతిపాదనలను విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి రుసుంలు పెంచనున్నట్టు వస్తున్న రిపోర్టులపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (ఎఫ్ఐఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే విమానయాన కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో రుసంలు పెంచింతే విమాన ప్రయాణికుల సంఖ్య మరింతగా పడిపోనుందని.. దీంతో పరిశ్రమ ఒత్తిడికి గురి కానుందని ఆందోళన వ్యక్తం చేసింది.