Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: చదువుకూ వయస్సుకూ సంబంధంలేదని నిరూపించిన శతాధిక విద్యార్థి భాగీరథీ అమ్మ (107) మృతిచెందారు. వందేండ్లు దాటిన తర్వాత నాలుగో తరగతి పూర్తి చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన కేరళకు చెందిన వద్ధురాలు మృతిచెందినట్టు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. వయో సంబంధిత వ్యాధులతో కొల్లాం జిల్లా ప్రక్కూలంలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. 105 ఏండ్ల వయసులో నాలుగో తరగతి పరీక్షలు రాసిన భాగీరథీ ఉత్తీర్ణత సాధించారు. వయసుతో సంబంధం లేకుండా చదువుపై శ్రద్ధ చూపిన ఆ వద్ధురాలిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం అభినందించారు. ఈమె కష్టాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికిగాను నారీశక్తి పురస్కారాన్ని ప్రదానం చేసింది. భాగీరథీ మతి పట్ల కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం ప్రకటి ంచారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారంటూ కొనియాడారు.