Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ ఎల్జీ ఆదేశాలు
న్యూఢిల్లీ : జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకొని నిర్బంధించవచ్చునని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశాలు జారీచేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోతవ్స వేడుకుల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, జంతర్‌మంతర్‌లో పెద్ద ఎత్తున సాగుతున్న రైతు ఆందోళనల్ని అరికట్టడమే లక్ష్యమని ఢిల్లీ రాజకీయవర్గాల్లో చర్చసాగుతోంది. ఎల్జీ జారీచేసిన ఆదేశాలు అక్టోబరు 18వరకు అమల్లో ఉంటాయని ఢిల్లీ పోలీసులు జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌పై పౌరహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురయ్యేవారు, వారిపై మోపిన నేరారోపణలు నిజం కాదని రుజువయ్యేవరకూ జైల్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జంతర్‌మంతర్ కేంద్రంగా రైతు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. నూతన సాగు చట్టాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గతకొన్ని నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, 'కిసాన్ సన్సద్' (రైతుల పార్లమెంట్)కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నిరసన గళాలు తమకు రాజకీయంగా ఇబ్బందిగా మారుతున్నాయని మోడీ సర్కార్ భావిస్తోంది. దాంతో నిరసనలు, ఆందోళ నలకు ఆస్కారం ఇవ్వకుండా ఢిల్లీ ఎల్జీ ద్వారా నోటిఫికేషన్ జారీచేశారని తెలుస్తోంది. ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా గళమెత్తేవారిని హఠాత్తుగా అరెస్టులు చేసి, జైలులో నిర్బంధించేందుకు తాజా నోటిఫికేషన్ అవకాశం కల్పిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు, నిరసనల్ని అడ్డుకోవడానికి గతేడాది కేంద్రం జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులకు అపరిమిత అధికారాల్ని కట్టబెట్టింది.