Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవాగ్జిన్ వ్యాక్సిన్ సరఫరా నిలిపివేత
న్యూఢిల్లీ : బ్రెజిల్‌కు చెందిన ప్రెసిక మెడికమెంటోస్ (ప్రెసిసా), ఎన్విక్సియా ఫార్యాస్యూటికల్స్తో భారత్ బయోటెక్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా బ్రెజిల్‌తో కుదుర్చుకున్న కరోనా వ్యాక్సిన్ ఒప్పందాన్ని విరమించుకున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్రెజిల్లో కరోనా కారణంగా 2లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడిపై అనేక విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ త్వరతగతిన సరఫరా కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సొనారో భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదర్చుకున్నారు. 2020 నవంబర్ 24న ఆ దేశ కంపెనీలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ల సరఫరాకు సంబంధించి అక్కడి ప్రభుత్వం సమక్షంలో ఆ రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసేందుకు బొల్సొనారో మధ్యవర్తిగా ప్రెసిసా మెడికామెంటోస్, ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ కంపెనీలను అనుమతించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఒక్కోడోసు 15 డాలర్ల (రూ.1110) చొప్పున 300 మిలియన్ డాలర్లు (రూ.2232 కోట్లు) విలువ చేసే 2 కోట్ల డోసుల కోసం బొల్సొనారో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కాగా.. ఈ వ్యాక్సిన్ ఒప్పందంలో బొల్సొనారోపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తన సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్‌కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ.735 కోట్లు) ముడుపులు అందుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అక్కడి అత్యున్నత న్యాయస్థానం కూడా విచారణకు ఆదేశించింది. దీంతో వ్యాక్సిన్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు భారత్ బయోటెక్ శుక్రవారం వెల్లడించింది.