Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మంది దుర్మరణం
అహ్మదాబాద్ : గ్యాస్ సిలిండర్ పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న తొమ్మిది మంది మరణించిన సంఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో సంభవించింది. నగరం శివారు ప్రాంతంలోని ఒక గదిలో ఈ నెల 20న గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా పేలిపోయింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరిలో ముగ్గురు గురువారం, ఐదుగురు శుక్రవారం, శనివారం ఒకరు మరణించారు. ఈ వివరాలను శనివారం పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు మైనర్లు ఉన్నారు.