Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం(క్యూ1)లో 78 శాతం వృద్ధితో రూ.4,616 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,599 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ1లో బ్యాంక్ మొత్తం ఆదాయం 6.5 శాతం పడిపోయి రూ.24,379 కోట్లకు తగ్గింది. నికర వడ్డీపై ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.10,936 కోట్లకు చేరింది. 2021 జూన్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 5.15 శాతానికి తగ్గాయి. 2020 ఇదే సమయానికి 5.46 జీఎన్‌పీఏ మోదయ్యింది.