Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మంది పర్యాటకులు మృతి
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ వద్ద కొండ చరియలు విరిగిపడడంతో అక్కడ ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. అదేవిధంగా ఈ ఘటనలో తొమ్మిది మంది పర్యాటకులు మరణించారు. 11 మంది పర్యాటకులు ఉన్న వాహనంపై ఈ భారీ కొండచరియలు పడ్డాయని, వీరిలో తొమ్మిది మంది మృతిచెందారని జిల్లా ఎస్పి సంజు రానా తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.