Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో పలుచోట్ల సీబీఐ దాడులు
- మొత్తం 2.78 లక్షల ఆయుధాల లైసెన్సుల స్కామ్
- 2012-16 ఐఏఎస్ అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్ల పాత్రపై దర్యాప్తు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో పలువురు ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ స్థాయిలో గన్ లైసెన్స్ స్కామ్‌కు పాల్పడ్డారంటూ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. జమ్మూకాశ్మీర్ సహా దేశ రాజధాని ఢిల్లీలోనూ స్థానికేతరులకు దాదాపు 2.78 లక్షల ఆయుధాల లైసెన్సులను అక్రమంగా మంజూరు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణను ప్రారంభించింది. 2012-16 మధ్య కాలంలో బినామీ పేర్లతో నకిలీ పత్రాలతో ఆయుధాలకు అక్రమ లైసెన్సులు జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సీబీఐ జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, అనంతనాగ్, బారాముల్లా వంటి ప్రాంతాలతో పాటు ఢిల్లీలోని పలువురు ఐఏఎస్, సంబంధిత ఇతర అధికారుల నివాసాలు, కార్యాలయాలపై ఈ దాడులు నిర్వహించింది. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ గిరిజన వ్యవహారాల కార్యదర్శిగా నియామకమైన షాహిద్ ఇక్బాల్ చౌదరి, ఢిల్లీలో అడిషనల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న నీరజ్కుమార్ల కార్యాలయాలలో సీబీఐ సోదాలు నిర్వహించింది.
దీనిపై షాహిద్ ఇక్బాల్ చౌదరి.. సీబీఐ తన నివాసంలో సోదాలు జరిపిందనీ, ఆయుధాల లైసెన్సులకు సంబంధించి అక్రమాలు జరిగినట్టు ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను సీబీఐ కనుగోనలేదంటూ ట్వీట్ చేశారు. తన పదవీ కాలానికి సంబంధించిన వాటిపై సీబీఐకి తాను పూర్తి జవాబు దారీగా ఉంటాననీ, కొన్ని కేసుల్లో కిందిస్థాయి సిబ్బంది ద్వారా జరిగే వ్యవహారాల్లో నిర్లక్ష్యం, వ్యవస్థాపరమైన లోపాలు జరగడాన్ని తోసిపుచ్చలేమంటూ ఆయన తెలిపారు. 2012-16 మధ్యకాలంలో జమ్మూకాశ్మీర్‌లో 4.49 లక్షల ఆయుధ లైసెన్సులు జారీ అయ్యాయనీ, ఇందులో 56,000 లైసెన్సులు రియాసి, కధువా, ఉదంపూర్ జిల్లాల నుంచి జారీ అయ్యాయనీ, ఆ మూడు జిల్లాలకు జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేశానని చౌదరి పేర్కొన్నారు. 2012-16 మద్య కాలంలో ఉధంపూర్‌లో 36,000 లైసెన్సులు జారీ కాగా, వీటిలో 1500 వరకు అంటే 4 శాతం కన్నా తక్కువ తన హయాంలో జరిగాయని తెలిపారు. అన్ని జిల్లా మెజిస్ట్రేట్లు జారీ చేసిన మొత్తం లైసెన్సుల్లో ఈ సంఖ్య చాలా తక్కువని పేర్కొన్నారు.కాగా, ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి దారి తీసిన ప్రధాన అంశం రాజస్థాన్‌లో నమోదైన 2017 కేసు. ఈ కేసులో భాగంగా అక్కడి పోలీసుల దర్యాప్తులో గన్ లైసెన్సులు పొందినవారిలో ఎక్కువ మంది క్రిమినల్ రికార్డులతో పాటు జమ్మూకాశ్మీర్ అధికారులు జారీ చేసిన లైసెన్సుడ్ ఆయుధాలను కలిగి ఉన్నారు. జమ్మూకాశ్మీర్ లోని దోడా పట్టణం, రాంబన్, ఉధంపూర్ జిల్లాల్లోని 1,43,013 లైసెన్స్‌లలో 1,32,321 లైసెన్స్‌లు రాజస్థాన్ వెలుపల నివసిస్తున్న వారికి జారీ చేసినట్టు రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని రాజస్థాన్ నివాసితులకు 4,29,301 లైసెన్స్ లలో 10 శాతం మాత్రమే జారీ చేయబడ్డాయి. 2018లో జమ్మూకాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న ఎస్ఎన్వోరా ఈ కేసును సీబీఐకి అప్పగించారు.