Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘాలు హెచ్చరిక
న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు తాజాగా అధికార బీజేపీకి మరో హెచ్చరికను జారీ చేశాయి. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు బీజేపీ నేతలను, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపాయి. జాతీయా జెండాలతో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామనీ, బీజేపీ నేతలకు నల్ల జెండాలు చూపుతామని రైతు సంఘాలు తెలిపాయి. మరోవైపు మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు భారీగా రైతన్నలు కదులుతున్నారు. కొనసాగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు.