Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు : సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిటాస్ పిటిషన్
- ప్రజాస్వామ్యాన్ని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించి రాజకీయ నేతలు, కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా వేసినట్టు వెలువడిన నివేదికలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరపాలని కోరుతూ సీపీఐ(ఎం) రాజ్యసభ జాన్ బ్రిటాస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, బ్యూరోక్రాట్లు, రాజ్యాంగ నిపుణులు సహా ముఖ్యమైన భారతీయ ప్రముఖుల 300 ఫోన్ నంబర్లు ఇజ్రా యిల్ స్పైవేర్ పర్యవేక్షించిన లక్ష్యాల జాబితాలో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. బ్రిటాస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యా జ్యంలో ఇటీవల నిఘా ఆరోపణలు దేశంలోని వివిధవర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయనీ, నిఘా స్వేచ్ఛా, వ్యక్తీకరణపై ప్రభా వాన్ని చూపుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యా న్ని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆరోపణలు చాలా తీవ్రమైన స్వభావం కలిగి ఉన్నప్పటికీ, ఈ సమస్యకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అటువంటి పరిస్థితులలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఎందుకంటే ఈ సమస్య పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వం నిఘా అధికారాలను పూర్తిగా దుర్వినియోగం చేస్తుందని పేర్కొన్నారు.అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లక్ష్యంగా కూడా నిఘా జరిగిందని సూచించే వార్తా నివేదికల గురించి పిటిషన్లో ప్రస్తావించారు. ''న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సిబ్బంది గాడ్జెట్లలో అంతరాయాలు జరుగుతాయని చెప్పబడినందున, న్యాయ పరిపాలనలో బలమైన జోక్యం ఉంది. ఇది అపూర్వమైన న్యాయవ్యవస్థ మనస్సాక్షికి షాకింగ్'' అని పిటిషన్లో పేర్కొన్నారు. ''ప్రభుత్వం తన సొంత మంత్రులు, సిబ్బంది, ఎన్నికల కమిషనర్లు, న్యాయమూర్తులు, సీబీఐ అధికారులు, సుప్రీంకోర్టు సిబ్బంది, కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులతో సహా రాజ్యాంగ నిపుణులు గాడ్జెట్లకు ఆటంకాలు కలిగించే కారణాలను అంచనా వేయాలి'' అని పిటిషన్లో పేర్కొన్నారు.''పెగాసస్ స్పైవేర్ అనధికారిక పద్ధతిలో ఉపయోగించబడితే అది ఆర్టికల్ 19 (1) (ఎ), ఆర్టికల్ 21 కింద పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది. పుట్టస్వామి (గోప్యత హక్కు) కేసులో న్యాయస్థానం సమర్థించిన వ్యక్తిగత గోప్యత హక్కుకు విఘాతం కలిగిస్తుంది. ఐటీ చట్టం, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నది. దీని కోసం తక్షణమే పారదర్శకతతో కూడిన స్వతంత్ర దర్యాప్తు అవసరం. దర్యాప్తు తర్వాత కఠినమైన శిక్షాచర్యలు తీసుకోవాలి'' అని పిటిషన్లో పేర్కొన్నారు.పార్లమెంటులో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనలను పిటిషన్లో ప్రస్తావించారు. పార్లమెంట్లో దీనిపై ప్రశ్నిస్తే, ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొనుగోలు, వాడకాన్ని ఖండించలేదనీ, అలాగే అంగీకరించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ''ఇది ప్రభుత్వం తప్పించుకునే ప్రకటన మాత్రమే. స్పైవేర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న ఎన్ఎస్ఓ సంస్థ ప్రకటనను ప్రభుత్వం నిస్సందేహంగా అంగీకరించింది. ఎటువంటి దర్యాప్తు లేకుండా వారి అభిప్రాయాన్ని గుడ్డిగా అంగీకరించింది'' అని పిటిషన్లో పేర్కొన్నారు.ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయవాది ఎంఎల్ శర్మ సిట్ దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేశారు.