Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్యను గొంతుకోసి చంపి.. కాల్చేసిన ఎస్సై అరెస్టు
అహ్మదాబాద్: గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి సాయంతో భార్యను దారుణంగా హత్య చేసిన పోలీస్ ఇన్ స్పెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని వడోదర జిల్లాలోని కర్జన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 5న వడోదర రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెంది అజరు దేశారు అనే ఎస్సై భార్య స్వీటీ కనిపించకుండా పోయింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఎస్పై ఆయన భార్యను కాంగ్రెస్ పార్టీకి చెందిన కిరీట్జింగ్ జడేజా అనే వ్యక్తి సాయంలో చంపి.. కాల్చివేసినట్టు తేలింది. మృతదేహాన్ని జడేజాకు చెందిన నిర్మాణంలో ఉన్న ఓ హౌటల్లో కాల్చేశారు. ఇది భరూచ్ జిల్లాలోని దహేజ్ హైవేలోని అటాలి గ్రామంలో ఉంది. దేశారు, జడేజాపై హత్య, సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపబడ్డాయని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ డిబి బరాద్ తెలిపారు. కాగా, జడేజా.. కర్ణన్ నుంచి 2020లో అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయాడు. కాగా, భార్యతో గోడవ పడ్డ దేశారు.. అదే రాత్రి గొంతుకోసి ఆమెను చంపారనీ, మృతదేహాన్ని ఒక దుప్పిటితో కప్పి జడేజా సాయంలో అటాలి గ్రామంలో నిర్మాణంలో ఉన్న హౌటల్లో కాల్చివేశారని పోలీసులు తెలిపారు.