Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2025 నాటికి కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 35 ట్రిలియన్ డాలర్లు వ్యయం చేయాల్సి వస్తోందని ప్రముఖ మేనేజ్మెంట్ సంస్థ మైక్కిన్సీ అంచనా వేసింది. గ్లోబల్ హర్డ్ ఇమ్యూనిటీని ప్రపంచం సాధించే అవకాశం లేదని, అయితే వ్యాక్సిన్ల కాంబినేషన్లు, పరీక్షలు అభివృద్ధి చేయడం, మెరుగైన క్వారంటైన్లతో వైరస్ను నిరోధించగలమని తెలిపింది. కఠినమైన, భారీ లాక్డౌన్ల కంటే ఇలాంటి చర్యలతో వైరస్ విజృంభణలను అడ్డుకోగలమని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అనేక అవరోధాలు ఉన్నాయని మైక్కిన్సీ తన నివేదికలో తెలిపింది. అధిక ఆదాయ దేశాల్లో ఈ నెల 14 నాటికి ఒక వ్యాక్సిన్ అయినా పొందిన వారు 49.6 శాతం ఉన్నారని, తక్కువ ఆదాయం ఉన్నవారిలో ఇది 1 శాతమేని పేర్కొంది.