Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు పోలీస్ అధికారులు మృతి : సీఎం వెల్లడి
డిస్పూర్ : అసోం- మిజోరాం సరిహద్దుల్లో సోమవారం చెలరేగిన ఘర్షణల్లో ఆరుగురు పోలీస్ అధికారులు మరణించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాలైన కాచార్ జిల్లా- కొలాసిబ్ జిల్లాల్లో కాల్పులు జరిగాయనీ, ప్రభుత్వ వాహనాలపై దాడులు జరిగాయని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని అసోం, మిజోరాం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ఆయన తిరిగి ఢిల్లీ చేరుకోగానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకో వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సిఎంలు అమిత్‌షాను ట్యాగ్ చేస్తూ.. వరుస ట్వీట్లు చేశారు. కాగా, ఇరు రాష్ట్రాల మధ్య జూన్‌లో చివరి ఘటన చోటు చేసుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు మిజోరాం ప్రభుత్వం సరిహద్దు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిష న్కు డిప్యూటీ సీఎం టాన్లూయా అధ్యక్షత వహిస్తుం డగా హోంమంత్రి లాల్చామ్లియాను ఉపాధ్యక్షులుగా నియమించారు. కాగా, అసోంకు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో కూడా సరిహద్దు వివాదాలు ఉన్నాయి.