Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యడియూరప్ప రాజీనామా
- బీజేపీ పాలిత సీఎంలు మారుతున్నా గోడీ మీడియా సైలెంట్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిచి మరీ రాజీనామాలు చేయిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నది. నిన్న ఉత్తరాఖండ్..ఇపుడు కర్నాటక సీఎం యడియూరప్ప రాజీనామా చేసినా గోడీ మీడియా ఎందుకని సైలెంట్‌గా ఉంటున్నది..? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సమస్యలు ఎందుకుని వెలుగులోకి రావటంలేదు.? దీని వెనుక ఉన్న ఆంతర్యమేంటీ..? ఇపుడు ఇదే హాట్ టాపిక్.
ఢిల్లీ: కర్నాటకలో ఉన్న కాంగ్రెస్,జేడీయూ సర్కార్‌ను సామ,దాన, బేధ,దండోపాయంతో బీజేపీ కుమారస్వామిని గద్దెదించింది. నాగన్ గౌడకు కోట్లు ఇస్తామంటూ మాజీ సీఎం యడియూరప్ప ఆఫర్ ఇచ్చారంటూ..అప్పటి సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేశాయి. చివరికి బీజేపీ ఆపరేషన్ లోటస్‌తో కుమారస్వామిని కుర్చీనుంచి దించేసింది. యడియూరప్ప మరోసారి సీఎం అయ్యారు. మరి ఈ రెండేండ్లలోనే ఆయనను ఎందుకు దింపారన్న చర్చ నడుస్తున్నది.మరోవైపు పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌తో సిద్ధరామయ్య సెక్రెటరీ, కుమారస్వామి సెక్రెటరీ, జీ పరమేశ్వర డిప్యూటీ సీఎంల ఫోన్లను హ్యక్ చేశారంటూ తాజా కథనాలు సంచలనంగా మారాయి.అది కూడా కర్నాటక రాజకీయ హీట్ ఎక్కినపుడు రాహుల్ గాంధీతో టచ్‌లో ఉన్నపుడు ఫోన్లను ఇజ్రాయిల్ సంస్థ ట్రాప్ చేసిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్నాటకలోనే కాదు..బీజేపీ పాలిత మరోరా ష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనూ ముగ్గురుసీఎంలు మారా రు.నెలలవ్యవ ధిలోనే ముఖ్యమంత్రులను బీజేపీ అధిష్టానం మార్చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వేగంగా సమీకరణలు మారుతున్నా యి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీలో లుకలుక సోషల్ మీడియాలో వస్తున్నా..గోడీ మీడియా మాత్రం పాలు తాగుతూ పిల్లి కండ్లు మూసుకున్న చందాన వ్యవహ రిస్తున్నది.దీని వెనుక ఆ ఛానళ్లకు యాడ్స్ రూపంలో కోట్లు ముడుతు న్నాయి.ఇటీవల యూపీ ముఖ్యమంత్రి గోరఖ్‌పూర్‌కు వెళ్లగా.. పెంపుడు కుక్క పరుగున వచ్చి యోగి కాళ్లకు నాకిందని గోడీ మీడియా హైలెట్ చేశాయి.దీని వెనుక యాడ్ రెవిన్యూ ముడిపడిఉండటంతో..ఆ రాష్ట్రాల్లో కరోనా విజృంభించినా..అత్యధిక మరణాలు సంభవించినా ..ఆ మీడియాకు కనిపించటంలేదు. వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి కన్నా..మతరాజకీయంతోనే ముడిపెడుతూ..వచ్చే ఎన్నికల్లో అక్కడి ప్రభుత్వాలు గట్టెక్కా లనుకుంటున్నాయి. దీనికి తోడు గోడీ మీడియా కాసులు దండుకుంటూ సీఎంలు మారినా..ఉపద్రవాలు వచ్చినా..ఈగ వాలనీయకుండా చేస్తున్నది.ఇటు రేటింగ్,అటు యాడ్ రెవెన్యూతో గోడీ మీడియా ఆగడాలు కొనసాగుతున్నాయని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హింది న్యూస్ ఛానల్స్ యూపీ సర్కార్ ఖర్చుచేసిన రెవిన్యూ యాడ్ల కోసం..రూ..కోట్లల్లో
న్యూస్ 18 10.96
ఆజ్ తక్ 10.14
ఇండియా టీవీ 9.05
జీ టీవీ 8.69
రిపబ్లిక్ భారత్ 8.14
ఏబీపీ న్యూస్ 7.24
న్యూస్ నేషన్ 5.09
న్యూస్ 24 3.52
ఇండియాన్యూస్ 2.92
సుదర్శన్ న్యూస్ 2.62