Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ ఎన్వి రమణను కోరిన బీసీి సంఘాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో జరిగే న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సామాజిక న్యాయం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణను బీసీ సంక్షేమ సంఘాల నాయకులు కోరారు. మంగళవారం నాడిక్కడ సీజేఐ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కేసన శంకర్ రావు, జాజుల శ్రీనివాస్ గౌడ్ల ఆధ్వర్యంలోని బీసీి ప్రతినిధుల బందం జస్టిస్ ఎన్వి రమణను కలిసింది. దేశంలోని న్యాయస్థానాల న్యాయముర్తుల నియామకాలలో బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ రిజర్వేషన్లు కల్పించాలని ఆయనను కోరారు. ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50శాతం సీలింగ్‌ను ఎత్తివేసి, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నాయకులు జస్టిస్ రమణకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందించారు. న్యాయస్థానాలలోనూ, న్యాయమూర్తుల నియామ కాలలోనూ సామాజిక న్యాయం అమలు జరిగేలా తన వంతు చర్యలు తీసుకుంటానని జస్టిస్ ఎన్వి రమణ హామీ ఇచ్చినట్టు బీసీ నేతలు తెలిపారు. సీజేఐను కలిసిన వారిలో బీసీ నేతలు రాచాల యుగేందర్ గౌడ్, కుమ్మరి క్రాంతి కుమార్, కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్, రావులకోల్ నరేష్,ఈడీగ శ్రీనివాస్ గౌడ్, పరుసా రంగనాథ్, పానుగంటి విజరు,సాయితేజ తదితరులు ఉన్నారు. అనంతరం ఢిల్లీలోని రోహిణిలో బీసీ పెడరేషన్ జాతీయ కార్యాలయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ప్రారంభించారు. ఢిల్లీ కేంద్రంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. దేశ జనాభాలో 50శాతం పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా దక్కే వరకు తమ పోరాటం ఆగదని ఆయన తెలిపారు.
న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్ కోటా కల్పించండి: ఆర్.కష్ణయ్య వినతి
సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల నియామకాల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్పి సింగ్ భగేల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఢిల్లీలోని ఏపీి, తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆర్.కష్ణయ్య గత 74 ఏండ్లలో వివిధ కోర్టుల్లో జరిగిన న్యాయమూర్తుల నియామకాల్లో ఇప్పటివరకు 3శాతం కంటే ఎక్కువ బీసీిలకు, 2 శాతం కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీలకు అవకాశం రాలేదని అన్నారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన 46 మంది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాల్లో ఒక్క బీసీకి అవకాశం ఇవ్వలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.