Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ సంసద్ తీర్మానం
న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కిసాన్ సంసద్ (రైతు పార్లమెంట్) డిమాండ్ చేసింది. మంగళ వారం జంతర్ మంతర్ వద్ద జరిగిన కిసాన్ సంసద్ ఈ మేరకు తీర్మానం చేసింది. సోమవారం మహిళా కిసాన్ సంసద్ చర్చలను మంగళవారం మూడు సెషన్ల ద్వారా కొనసా గించారు. తొలి సెషన్‌కు పి.ఆర్ పాండియన్ (తమిళనాడు), రణధీర్ సింగ్ ధీరా (పంజాబ్), రెండో సెషన్‌కు రిషిపాల్ అంబవట (యుపి), ఇందర్జీత్ సింగ్ (పంజాబ్), మూడో సెషన్‌కు జర్నైల్ సింగ్ (హర్యానా), హర్మీందర్ సింగ్ ఖైరా (పంజాబ్) స్పీకర్, డిప్యూటీ స్పీకర్లగా వ్యవహరించారు. పార్లమెంట్లో నిత్యావసర వస్తువల సవరణ చట్టాన్నివెంటనే రద్దు చేయాలని కిసాన్ సంసద్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఈ చట్టాన్ని ఇప్పటికే కిసాన్ సంసద్ రద్దు చేసిందని, అదే విధంగా పార్లమెంటును కూడా చేయమని అడుగుతుందని నేతలు తెలిపారు. ''రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలతో సంప్రదించి పంటలకు మార్కెటింగ్, రవాణా, నిల్వ సౌకర్యాలు, ఆహార ప్రాసెసింగ్‌ను బలోపేతం చేయాలి. ప్రజలందరికీ ఆహారం, పోషకాహార భద్రతను నిర్ధారించడానికి ఆహార పంపిణీ వ్యవస్థలో మెరుగుదల తీసుకు రావాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు.