Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాల్లో 8.01 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6.75 శాతం నిరుద్యోగ రేటు
- 2019-20లో నిరుద్యోగిత రేటు 4.8 శాతమే: కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అనేక రంగాలను ఒత్తిడిలోకి నెడుతూ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మరీ ముఖ్యంగా ఉపాధి అవకాశాలను దెబ్బతీ స్తూనేఉంది. సెంటర్ఫర్మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాలప్రకారం నిరుద్యోగిత రేటుపెరుగుతూ 7.14 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాల్లో స్వల్పంగా పెరుగగా, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పెరుగు దల కనిపించింది. అయితే, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి మాత్రం నిరుద్యోగ రేటు 2019-20లో 4.8 శాతంగా ఉందని తెలిపారు. సోమవారం పార్లమెంట్లో ''జాతీయ నిరుద్యోగిత రేటు 4.8 శాతం, 2018-19లో 5.8 శాతం, 2017-18లో 6 శాతం'గా ఉందని వెల్లడించారు. సీఎంఐఈ తాజా గణాంకాల ప్రకారం..గత వారం జాతీయ నిరుద్యోగిత రేటు 5.98 శాతంగా ఉండగా.. జులై 25తో ముగిస ిన వారంలో జాతీయ నిరుద్యోగిత 7.14 శాతానికి పెరిగింది.పట్టణ,గ్రామీణ రెండు ప్రాంతాల్లోనూ పెరుగుదల కనిపించింది. జూలై 25తో ముగిసిన వారంలో పట్టణ నిరుద్యోగం 8.01 శాతంగా నమోదైంది. అంతకుముందు వారంలో 7.94 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జూలై 25తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 6.75 శాతానికి పెరిగింది. అంతకు ముందు వారం ఇది 5.1 శాతం ఉంది. కాగా, మే 23తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు గరిష్టంగా 14.73 శాతానికి పెరిగింది. ఆ తర్వాత కరోనా ప్రభావం తగ్గుతూ వస్తుం డటం, ఆంక్షల సడలించడంతో మొత్తం నిరుద్యోగ రేటు క్షీణత సంకేతా లను చూపించిది. కానీ మళ్లీ స్వల్పంగా పెరుగుతూ వస్తున్నది. ఏప్రిల్ 4న నిరుద్యోగ రేటు 8.16 శాతంగా ఉండగా, అదే నెల 25తో ముగిసిన వారంలో 7.4 శాతానికి చేరింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే నెలవారీ నిరుద్యోగ రేటు 11.9 శాతం ఉండగా, జూన్లో 9.17 శాతానికి క్షీణించగా, పట్టణ ప్రాంతాల్లో 10.07 శాతం, గ్రామీణంలో 8.75 శాతానికి చేరింది. సీఎంఐఈ సీఈవో, ఎండీ మహేష్ వ్యాస్.. 'జూన్లో రికవరీ ఉన్నప్పటికీ.. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఉద్యోగ నష్టాలు అధికంగానే ఉన్నాయనీ, ఈ అంతరాలను పునరుద్ధరించడానికి నెలల సమయం పట్టే అవకాశముంది' అని పేర్కొన్నారు.